News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..


తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్. 1865 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ నీటి సరఫరా శాఖలో 359, రెవెన్యూ శాఖలో 1506 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టీఎస్‌పీఎస్సీ వీటికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆర్‌డబ్ల్యూఎస్‌లో 277 ఏఈఈ, 82 ఏఈ పోస్టులను; రెవెన్యూ శాఖలో 700 వీఆర్వోలు, 450 జూనియర్‌ అసిస్టెంట్లు & టైపిస్టులు, 210 డిప్యూటీ సర్వేయర్లు, 38 కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మెన్స్‌, 38 డిప్యూటీ తహసీల్దార్లు, 22 సబ్‌రిజిస్ట్రార్లు, 8 డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.